మహా ధర్నా జయప్రదం కోరుతూ సిపిఎం జోగవాణి పాలెం శాఖ పాదయాత్ర


 TV77తెలుగు గాజువాక :

సాయి రామ్ నగర్,జీవీఎంసీ 67వ వార్డుల్లో పెంచిన ఆస్తి ఆధారిత పన్ను కొత్తగా వేసిన చెత్త పన్ను అక్రమ పెనాల్టీలు రద్దు చేయాలని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల 11వ తేదీన చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం 67వ వార్డు సాయి రామ్ నగర్ ,శంకర్ నగర్ , అశోక్ నగర్ , మారుతీ నగర్లను కలుపుతూ హై స్కూల్ రోడ్డు మీదుగా పాదయాత్ర నిర్వహించబడింది పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెప్పినదే తడవుగా నూతన పట్టణ సంస్కరణల పేరుతో చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు అమలు  చేయనటు వంటి సంస్కరణలను, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  అమలు చేస్తున్నారు .ఇప్పటికే అనేక అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. జనవిజ్ఞాన వేదిక పట్టణ నాయకులు డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ చెత్త పన్ను  విషయానికి వస్తే ఆస్తిపన్ను లో కన్వెర్వెన్సీ పన్ను కూడా ఇమిడి ఉంది చెత్త సేకరణ,రవాణా వంటి సేవలు అందించేందుకు ఉద్దేశించబడిన 1955 మున్సిపాలిటీ చట్టం లోని 489 సెక్షన్ ప్రకారం ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయరాదు చెత్త పన్ను వసూలు చేసినట్లయితే ఓకే సేవకు రెండుసార్లు పన్నులు వసూలు చేసినట్లు అవుతుంది అని 1955 మున్సిపాలిటీ చట్టం లో పేర్కొన్న ఉందని పలువురు వక్తలు వివిధ కూడలి లలో ప్రజలకు వివరించారు  సిపిఎం నాయకులు కె పి కుమార్  మాట్లాడుతూ అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆస్తి ఆధారిత పన్ను చెత్త పన్ను వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కిరీటం  మాట్లాడుతూ చెత్త పన్ను కట్టకుంటే సంక్షేమ పథకాలు  నిలిపివేస్తామని బెదిరింపులకు దిగడం సరికాదన్నారు  పాలకులు ప్రజలు వ్యతిరేకతను అర్థం చేసుకుని పెంచిన ఆస్తిఆధారిత పన్ను చెత్త పన్ను వెంటనే రద్దు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.కే సంతోష్  మాట్లాడుతూ ఆస్తి ఆధారిత పన్ను విధానం కాకుండా కాకుండా పాతపన్ను విధానాన్నే అమలు చేయాలని ఆమె కోరారు.ప్రజల ఓట్లతో గద్దెనెక్కి తిరిగి వారిని బెదిరింపులకు దిగడం సరికాదన్నారు లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ప్రజలపై అధిక భారాల వేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు ప్రజలు వ్యతిరేకతను అర్థం చేసుకుని వెంటనే చెత్త పన్ను మరియు ఆస్తి ఆధారిత పన్నును రద్దు చేయాలని కోరారు ఈ పాదయాత్రలో జి పద్మజా,టి సూర్యకుమారి గారు,శేఖర్ ,బోట్ట పెంటారావు ,అప్పల రాజు ,అక్కయ్యమ్మ తదితరులు పాల్గొన్నట్లు శాఖ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ స్వామి పాలూరు తెలిపారు.