TV77తెలుగు ఆలమూరు క్రైమ్ :
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గోదావరి స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో విద్యార్థి బయట పడ్డాడు. ఆదివారం కావడంతో ఇదే మండలం చెముడులంక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న హెచ్చు రాహుల్(14),రొక్కాల రోహిత్(14) వాకపల్లి జినేంద్ర వినయ్ కౌషిక్ లు మోటారు సైకిల్ పై బడుగువానిలంక గోదావరి రేవులో స్నానానికి వెళ్లారు. నీరు తక్కువగా ఉందని ఎంతో ఆనందంగా వీరు దిగారు. అయితే అక్కడ ఉండే ఊబిని అంచనా వేయలేకపోయారు.దీంతో రాహుల్, రోహిత్ లు కళ్లముందే మునిగి పోతుంటే వినయ్ బయపడి ఒడ్డుకు వచ్చేసాడు.మునుగుపోతున్న వారికి ప్యాంట్ అందించి వినయ్ రక్షించే ప్రయత్నం చేసాడు.అయతే అత్యంత ప్రమాదకరమైన ఆ ఊబి ఈ ఇద్దరిని పొట్టన పెట్టుకుంది.స్థానికులు వారికోసం గాలించగా కొద్ద సేపటికి రాహుల్ మృతదేహాం లభ్యమయింది.మరొకరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు..ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇలా దూరమైపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మృతులు ఇద్దరూ చెముడులంక గ్రామానికి చెందిన వారు కాగా బయట పడిన విద్యార్థిది చొప్పెల్ల గ్రామం.సంఘటనా స్థలానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ లు వెళ్ళి సహకచర్యలు చేపట్టారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే చూస్తానని జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.