TV77తెలుగు రాజమహేంద్రవరం:
రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ( పర్సనల్ ఫొటో గ్రాఫర్) కెమెరామెన్ యండ్రపు శ్రీకాంత్ రాజా ( శశి ) పుట్టినరోజు వేడుకలు వృద్ధులు, అంధులు , వికలాంగుల మధ్య ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రోత్సాహంతో మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సిపి నాయకులు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో శ్రీకాంత్ రాజా ( శశి ) పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గురువారం లాలా చెరువులోని జియోన్ అంధుల పాఠశాలలోను , గౌతమీ జీవ కారుణ్య సంఘం వృద్ద ఆశ్రమంలోను శ్రీకాంత్ రాజా ( శశి ) పుట్టినరోజు సందర్భంగా అంధ విద్యార్థులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీకాంత్ రాజా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అజ్జరపు వాసు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జరపు వాసు , పెన్నమన్న ఈశ్వరుడు, నల్లమిల్లి వెంకన్నబాబు, కుంచె శేఖర్ బాబు, గొంప సుధాకర్, కాలేపు దొరబాబు, ద్వారా జగదీష్, రెడ్, హరీష్, బంటి, గుత్తుల కృష్ణ, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.