పుష్కరఘాట్ శ్రీ వీరభద్రస్వామి స్వామి వారి సంబరాల్లో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ భరత్


TV77తెలుగు రాజమండ్రి :

ఈ రోజు రాజమండ్రి పుష్కరఘాట్ లో శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్ట జరిగి 65 సంవత్సరాలు పూర్తి అయ్యిన సందర్భముగా ఆలయాన్ని సందర్శించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ప్రతి సంవత్సరం ఈ సంబరాలకు రావడం తనకు ఆనవాయితీ అని, రాష్ట్ర ప్రజలు, రాజమండ్రి వాసులు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ వీరభద్రస్వామి వారిని కోరుకున్నాను అని ఎంపీ భరత్ అన్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం అవ్వాలని స్వామి వారిని కోరుకున్న ఎంపీ భరత్.ఈ కార్యక్రమంలో ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, హితకారిని ట్రస్ట్ బోర్డు మెంబెర్ ఉల్లూరి రాజు, చవాకుల సుబ్రహ్మణ్యం, దుంగా సురేష్, దుంగా మంగ, అనంతలక్ష్మి, గేడి అన్నపూర్ణ రాజు, బిల్డర్ చిన్నా, మార్గాని బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.