TV77తెలుగు పీలేరు :
చిత్తూరు జిల్లా, పీలేరు పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీని గురువారం ఉదయం స్థానిక మదనపల్లి రోడ్డు సమీపములో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం పీలేరు పట్టణంలో నిర్మించినందుకు హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ టీ.ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా జాతీయ క్రీడాకారిణి హోత్రిశ్రీ ని దుష్శాలువా కప్పి ఘనంగా సన్మానించి హోత్రిశ్రీ అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించి, మన దేశానికి కీర్తిప్రతిష్ఠలు తేవాలని ఆశీర్వదించారు. బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ టీ.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ అకాడమీని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీ లో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు పే అండ్ ప్లే స్లాట్స్ ఉంటాయని సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాసక్తిగల పీలేరు ప్రాంత ప్రజలు మరియు వారి పిల్లలు వినియోగించుకోవాలని కోరారు. తమ అకాడమీలో చేరాలనుకునే ఆసక్తిగలవారు స్లాట్స్ బుక్ చేసుకోవాలని వివరాలకు తమ మొబైల్ నెంబర్ 9985612234 కు సంప్రదించాలని తెలిపారు పై కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యేల తో పాటు సర్పంచ్ షేక్ హాబీబ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జడ్పి కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ, స్టేడియం స్థల దాత వంశీకృష్ణ, సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాచపల్లి రాజగోపాల్ రెడ్డి, ప్రసాద్, రాజంపేట ఎం.పీ వ్యక్తిగత సహాయకులు ఉదయ్ కుమార్, వైస్ ఎం.పీ.పీ హరిత, జాతీయ క్రీడాకారిణి హోత్రిశ్రీ కుటుంబ సభ్యులు, బంధువులు, వై.సి.పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.