TV77తెలుగు రాజమహేంద్రవరం :
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి మొండి చేయి చూపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారిని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్, ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.జగన్మోహనరెడ్డి తన కేసుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం వలనే కేంద్రం పై ఒక్క విమర్శ కూడా చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు.కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర బిజెపి నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఇక రైతులు,పేదల సంక్షేమం కోసం ఏ ప్రస్తావన లేదన్నారు.