TV77తెలుగు పీలేరు :
స్థానిక మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం దివ్యాంగ పిల్లలకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ కార్యక్రమం పీలేరు మండల విద్యాధికారి ఎం.బాలాజీ నాయక్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో పీలేరు, కలికిరి, కె.వి పల్లి, రొంపిచర్ల, పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు, కలకడ, సోమల, సదుం మండలాల నుండి సుమారు నూరు మందికి పైగా హాజరయ్యారు. వీరిని డాక్టర్స్ పరీక్షించి సిపార్సు చేసిన విదంగా వారికి కావలసిన వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్లు, వీల్ చైర్లు తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ లావణ్య మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు విద్యాభివృద్ధికి మరియు ఆరోగ్యపరమైన శారీరక అభివృద్ధికి ప్రభుత్వం వివిధ రకాలుగా ఉపయోగపడే ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పై కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీ.రంగనాథ రెడ్డి, ఆర్తో డాక్టర్ ఓబయ్య, ఈ.ఎన్.టి డాక్టర్ ఈశ్వర సురేంద్ర, ఫిజియోథెరపిస్ట్ సుజాత, ఆడియాలజిస్టు జయ కృష్ణ, సహిత విద్య ఉపాధ్యాయులు శైలజ, లలిత కుమారి, మహేష్, ధరణిజ, సుబ్రహ్మణ్యం ,మనోహర్, రెడ్డిప్రసాద్, రవి, వెంకటరమణ, నాగరాజు, లక్ష్మీ నరసింహ, సి.ఆర్.పి మురళీధర రాజు తదితరులు పాల్గొన్నారు.