వంటింటి మహిళలే టార్గెట్....!!!

 


TV77తెలుగు ఇబ్రహీంపట్నం:

ఈజీ మనీ, ఫాస్ట్ మనీ కోసం మార్కెటింగ్ లో కొత్త పుంతలు తొక్కుతున్న కేటుగాళ్లు....!!

లాటరీల పేరుతో సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మార్కెటింగ్ మాఫియా....!!

మిక్సిలు,కుక్కర్లు ఏరా చూపి చెంబు చేతిలో పెడుతున్న వైనం....!!

కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో యదేచ్చగా జరుగుతున్న మార్కెటింగ్ మాఫియా....!!!

వేల రూపాయల వస్తువులు వస్తాయంటూ కొనసాగుతున్న వసూళ్ల పర్వం....!!

మార్కెటింగ్ మాఫియా కొత్త ట్రిక్... ఉదాహరణ గా ఒక గృహిణి ఒక 1000 రూపాయలతో ఒక షర్ట్ బిట్ ( అది 200 విలువ చేయదు)  కొనుగోలు చేయాలి.. అల కొనుగోలు చేసిన షర్ట్ బిట్ లో లాటరీ పెట్టీ అందులో ఏ వస్తువు వస్తె ఆ వస్తువు ఆ గృహిణి సొంతం అవుతుంది.. తీర లాటరీ లాగి చూస్తే అందులో ఒక చెంబో, సట్టి నో ( 100 విలువ గల)ది తగులుతుంది... ఇలా ఆ మహిళకు 1000 పెడితే ఒక 300 విలువ చేసే వస్తువులు చేతిలో పెట్టీ మిగిలిన 700 మార్కెటింగ్ మాఫియా జేబుల్లోకి వెళుతుంది.. తీర అంత అయిపోయాక సదరు మహిళ తాను మోసపోయినట్లు గ్రహించి లబో దిబొ మంటున్నది... ఇదే అసలు జరుగుతున్న తంతు....!!!  

ఈజీ మనీ, ఫాస్ట్ గా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కొందరు కేటుగాళ్లు మార్కెటింగ్ ను ఎంచుకొని కొత్త పుంతలు తొక్కుతున్నారు... గ్రామీణ ప్రాంతాల్లోని వంటింటి మహిళలను టార్గెట్ గా చేసుకుని మార్కెటింగ్ మాఫియా అందినకాడికి దండుకుంటున్నారు... లాటరీ ద్వారా వేల రూపాయల విలువ చేసే వస్తువులు మీ సొంతం అవుతాయి అంటూ నమ్మబలికి చివరిగా ఒక చెంబు చేతిలో పెట్టీ గృహిణులను బురిడీ కొట్టిస్తున్నారు.. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన ఈ మార్కెటింగ్ మాఫియా అర్బన్ ప్రాంతాల్లో సైతం తమ దందా చేతి వాటం చూపిస్తూ మహిళను నిండా ముంచేస్తున్నారు.. ఇప్పటికే అనేక మంది మహిళలు ఈ మార్కెటింగ్ మాఫియా బారిన పడి మోసపోగా వారంతా ఇప్పుడు లబో దిబో మంటున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెటింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు... అలానే సాధారణ మహిళలు సైతం ఇలాంటి మోసపూరిత వ్యవహారాల పట్ల తస్మాత్ జాగ్రత్త.....!!

సత్య. రిపోర్టర్, మైలవరం