ఫిర్యాదుదారులకు తగు పరిష్కార మార్గం చూపాలి


    TV77తెలుగు  రాజమహేంద్రవరం :

నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుదారులకు తగు పరిష్కార మార్గం చూపాలి - ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి

అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మరియు అడిషనల్ ఎస్పీ (లా& ఓ)  కె.లతామాధురి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  ఫిర్యాదుదారుల అర్జీలను వారు స్వీకరించి, వారి సమస్యలను విని, వాటి పూర్వాపరాలను అడిగి తెలుసుకుని వారికి రసీదులను అందించినారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నిబంధనల, చట్ట ప్రకారం విచారణ జరిపించి ఫిర్యాదుదారుల సమస్యలు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుదారులకు తగు పరిష్కార మార్గం చూపాలని సూచించడం జరిగింది.