ఆటో డ్రైవర్ మృతి... సంతాపం తెలిపిన ఆటో యూనియన్ నాయకులు


 

 TV77తెలుగు పీలేరు:

చిత్తూరు జిల్లా, పీలేరు మండలం, శివరాంపురం నకు చెందిన సయ్యద్ సాహెబ్(55) అలియాస్ గబ్బర్ సింగ్ అనారోగ్యంతో ముస్లిములకు అతి పవిత్ర దినమైన శుక్రవారం మృతి చెందారు. శనివారం ఉదయం బిస్మిల్లా ఆటో యూనియన్ నాయకులు శివరాంపురంలో పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అతని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బిస్మిల్లా ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బొదేషా వలీ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఆటో పైనే జీవనం సాగిస్తూ, గర్భిణీలకు పేదలకు ఉచిత సేవ కూడా అందించి సేవా గుణం కలిగిన సయ్యద్ సాహెబ్ అలియాస్ గబ్బర్ సింగ్ మృతి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపాడు. అలాగే బిస్మిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం కూడా చేస్తామని, ప్రభుత్వ పరంగా వర్తించే ఆర్థిక ప్రయోజనాల కోసం తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పై కార్యక్రమంలో బిస్మిల్లా ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొదేషావలి తోపాటు ఆటో యూనియన్ సీనియర్ నాయకుడు జానం గంగిరెడ్డి, బిస్మిల్లా ఆటో యూనియన్ పట్టణ నాయకులు వరగాని వెంకటరమణ, నౌలాక్, సైఫుల్లా, చినబాబు, వెంకటసుబ్బయ్య, చంగల్రాయుడు, గంగయ్య, ఖాదర్ వలీ, గుణశేఖర్, విజయ, అక్బర్, మోదీని భాష, వెంకటేష్, శీను ,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.