TV77తెలుగు వాల్మీకిపురం :
చిత్తూరు జిల్లా. ప్రభుత్వం మొదట ప్రతిపాదన ప్రకారం కొత్త రైల్వే లైన్ కడప-బెంగళూరు వయా వాయల్పాడు కాకుండా ముద్దునూరు-ముదిగుబ్బ ద్వారా లైన్ ఏర్పాటు చేయాలనే కొత్త ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందనే విషయాన్ని కొన్ని పత్రికల్లో వచ్చింది. ఇది తెలిసిన వాయల్పాడు యువత మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వాయల్పాడు సహారా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సాధిక అహ్మద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కడప-బెంగళూరు వయా వాయల్పాడు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన అయితే వాయల్పాడు కు చాలా నష్టం జరుగుతుందని, ఇప్పటికే వాయల్పాడు పట్టణవాసులు ఎన్నో కోల్పోయారని జిల్లాలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చెందుతుంటే వాయల్పాడు మాత్రం వెనుకబడి పోతుందని కాబట్టి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పార్టీలకు, కులమతాలకు, అతీతంగా ప్రజా సంఘాలు, ప్రజా సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు అందరూ 15 వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు వాల్మీకిపురం పంచాయతీ ఆఫీస్ నందు స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించాలని ఎలాగైనా కడప- బెంగళూరు వయా వాయల్పాడు రైల్వే లైన్ సాధించాలని వాయల్పాడు సహారా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సాధిక అహ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.