TV77తెలుగు అనంతపురం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్య శాఖ అధికారుల హెచ్చరికల మేరకు నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిబంధనలు వర్తిస్తాయని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ క్రమంలో అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి పుట్టపర్తిలో వినూత్నంగా మాస్క్‌లు లేని వారికి తానే స్వయంగా తొడిగారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు మాస్క్‌లు ధరిస్తున్నారా? లేదా..? కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారో లేదో అని పరిశీలించేందుకు బుధవారం ఎస్పీ పుట్టపర్తి వచ్చారు. ఈ క్రమంలో రోడ్లపై మాస్క్ లేకుండా వెళ్తున్న వారిని దగ్గరకు పిలిచి తానే స్వయంగా మాస్క్‌లు తొడిగి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ప్రజలతో మాట్లాడిన ఎస్పీ.. కరోనా ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. మాస్కుల ధరింపుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.