TV77తెలుగు తెలంగాణ :
యునెస్కో దృష్టికి "హేవలాక్"
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్, పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్.
పురాణ ఐతిహాసిక విశిష్టత కలిగిన ప్రాచీన రాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా ప్రకటించాలని కోరుతూ రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీప్ విప్ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ శ్రీమతి వాణిమోహన్ తో కలిసి ఈ ప్రతిపాదనలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి ని న్యూఢిల్లీలో శుక్రవారం కలిసి ప్రతిపాదనల వినతి పత్రం అందజేశారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడి హోదాలో కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ, వైయస్సార్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఈ మేరకు రాజమహేంద్రవరం నగర ప్రాశస్త్యానికి సంబంధించిన డాక్యుమెంట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమర్పించారు. రాజమహేంద్రవరం లోని గోదావరి నదిపై ఉన్న దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జిని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రాజెక్ట్ ఇచ్చారు.తరతరాల చరిత్రకు నిక్షిప్తంగా ఉన్న రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ఆధునిక విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎన్నో పురాణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న నగరాన్ని పర్యాటక విశిష్టత కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వెంగీ రాజులు, రాజ రాజ నరేంద్రుడు, రెడ్డి రాజులు, పల్లవులు, కాటమ వేమారెడ్డి రాజులు పరిపాలించిన ప్రాచీన నగరం సాంస్కృతిక రాజధానిగా ఉందని, దక్షిణ గంగగా పిలవబడే గోదావరి నది తీరంలో ఉన్న ఈ ప్రాచీన నగరానికి హెరిటేజ్ సిటీగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందే అన్ని అవకాశాలు, ఆధారాలు కలిగి ఉందని అని వివరించారు.యునెస్కో హేవలాక్ బ్రిడ్జిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లడం జరిగిందని చెప్పారు.ఎన్నో చారిత్రక ఆధారాలు కలిగిన ఈ పురాతన నగరం హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చుకోవాలని అభిలసిస్తోందన్నారు. గోదావరి నదిపై ఉన్న హెవలక్బ్రిడ్జిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్రప్రభుత్వం యునెస్కో కు ప్రతిపాదనలు పంపించింది అన్నారు. ఈ బ్రిడ్జి పై 1900 నుంచి ట్రాఫిక్ మొదలైందని, అప్పటి నిర్మాణ ఇంజనీర్ హేవలాక్ పేరిట నామకరణం జరిగిందన్నారు.రాజమహేంద్రవరం లో చరిత్రకు ఆనవాళ్లుగా దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ లో ఎన్నో అరుదైన అపురూపమైన పెయింటింగ్స్ ప్రదర్శనశాలగా ఉందన్నారు. ఇది కూడా ఒక చారిత్రాత్మక ఆనవాలుగా చెప్పుకోవచ్చని చెప్పాలి. వేన ఏళ్ళ చరిత్ర కు సజీవ సాక్షిగా రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంలో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన పురాణ ఇతిహాసిక, ప్రాచీన చారిత్రక వైభవానికి ఎన్నో సాక్షాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయన్నారు.వేలాది తాళపత్ర గ్రంధాలు బంగారు నాణాలు శిలలు శిల్పాలు రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం లో నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన చారిత్రిక కట్టడాల అవశేషాలు, గుళ్ళూ గోపురాలు, శివ లింగాలు, నంది తదితర ఎన్నో ఈ ప్రాంత చరిత్ర సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయన్నారు. రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ఆధునీకరించి భావితరాలకు అందించాలన్నారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన వేల సంవత్సరాల నాటి నంది, శివలింగం ఈ మ్యూజియంలో భద్రపరిచడం జరిగిందన్నారు. శివలింగం, నంది కూడా బయటపడ్డాయని, అత్యంత అరుదైన శిల్ప నైపుణ్యం కలిగిన మృకండేశ్వర స్వామి ఆలయాన్ని పునర్ నిర్మాణం చేయాలని నివేదికలో వివరించారు. సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం బ్యారేజి ని ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక తలమానికంగా అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.కాటన్ నివసించిన ప్రాంతాన్ని,వినియోగించిన సామాగ్రి, ఆయన నివాసం తదితర ప్రాంతాలను సైన్స్ పార్క్ అధ్యయన కేంద్రాలు గా తీర్చి దిద్ది ప్రాచీన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు.డచ్ వారు కోట గా ఉండే ప్రస్తుత కేంద్ర కారాగారాన్ని 1602 లో నిర్మించడం జరిగిందని, 1864 లో ఈ కోట బ్రిటిష్ వారు జైలు గా మార్చారన్నారు.1870లో కేంద్ర కారాగారంగా ఉన్నతీకరిగించడం జరిగిందని చెప్పారు. ఈ కోటను చారిత్రక కట్టడంగా సంరక్షించుకోవాలని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ చారిత్రక ప్రదేశాలు పురాణ ప్రాశస్త్యం కలిగిన ఆలయాలు, ప్రాచీన నగరాన్ని రాష్ట్రంలో పర్యాటక హెరిటేజ్ సిటీగా గుర్తింపు ఇవ్వాలని చరిత్ర సాక్ష్యాధారాలతో నివేదికను పొందుపరచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఎంపీ మార్గాని భరత్ రామ్ పురావస్తు శాఖ కమిషనర్ వాణీ మోహన్ సమక్షంలో సమర్పించారు.అదే విధంగా గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం కూడా చరిత్రకు అధ్యయన కేంద్రంగా ఉందన్నారు. హేవలాక్ బ్రిడ్జిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యునెస్కో గుర్తింపు ఇస్తూ తగిన నిధులు కేటాయించాలని, ఇందుకు కేంద్ర మంత్రి కృషి చేయాలని, నిధులు సమకూర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం యునెస్కో కు నివేదిక పంపించిందని ఎంపీ వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కేంద్ర మంత్రికి వివరిస్తూ ఈ మేరకు ప్రతిపాదిత వినతి పత్రాన్ని సమర్పించారు.