ఉష్... డ్యామిడ్ మేటర్ మొత్తం డ్యామేజ్....!!


 TV77తెలుగు  కొండపల్లి:

బీసీ కార్డు కుట్ర రాజకీయాల కథ అడ్డం తిరిగిందా...??

కులం కార్డు అడ్డం పెట్టుకొని చేసిన వికృత రాజకీయ క్రీడకు శుభం కార్డు పడిందా...??

మైలవరం నియోజకవర్గం లో బిసిలను అణచివేస్తున్నారు అంటూ పసుపు వంచన...!!

వైసీపీ ప్రభుత్వ పాలన లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సారథ్యంలో బిసిలకు ఎంత మేలు జరిగిందో బయట పెట్టిన బీసీ నేతలు...!!!

జరిగిన విష ప్రచారం తో ఎమ్మెల్యే వసంత కు మరింత దగ్గరైన బీసీలు....!!

ఒకరి తరువాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెంట నడుస్తామంటు వాఖ్య....!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు రాజకీయంగా వైసీపీలో పెను దుమారం రేగింది.మైలవరం నియోజకవర్గం లో బిసి లకు అన్యాయం జరుగుతుందని, బిసిలు అణచివేతకు గురవుతున్నారు అంటూ తెర మీదకు వచ్చిన ప్రచారం కాస్త మదిరి పాకాన పడింది.. దీంతో కుట్ర రాజకీయాలు పురుడు పోసుకున్నాయు. మైలవరం నియోజకవర్గ బీసీలపై పసుపు వంచన మొదలైంది. జరిగిన విష ప్రచారం అడ్డం పెట్టుకొని  ఒక నొక దశలో యావత్ మైలవరం బిసిలలో కారు చిచ్చు రాజేసి పసుపు గరళాన్ని ప్రజలలోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను బీసీ అణచివేత వాదిగా చిత్రికరించే ప్రయత్నం చేశారు.  కానీ అనూహ్యంగా యావత్ బీసీ సోదరులు జరుగుతున్న విష ప్రచారం పై ఉక్కు పాదం మోపారు. ఒకరి తరువాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టీ మైలవరం లో బిసిలకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి అంటూ కుట్రదారులకు బహిరంగ సవాల్ విసరారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వసంత బిసిలకు చేసిన న్యాయం ఏమిటో గణాంకాల తో సహా బహిర్గతం చేశారు. బిసిలను నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్యే వసంత వెంట యావత్ మైలవరం బిసిలు ఉన్నారని తేల్చి చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బిసిల మద్య చిచ్చు పెడుతారా అంటూ ఆగ్రహం తో ఊగిపోయారు. దీంతో మైలవరం పసుపు వంచనకు తెర పడినట్లయింది. కులం కార్డుతో రాజకీయం చేయాలని భావించే పార్టీలకు ఇది చెంప పెట్టు లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలకు దగ్గర కావడం కోసం ఇలాంటి విష ప్రచారం పక్కన పెట్టీ ప్రజలకు ఎం ఇవ్వాలో తెలుసుకున్న నాడు పారదర్శక పాలన సాధ్యపడుతుందని వాఖ్యాని స్తున్నారు. మొత్తంగా బిసి కార్డు తో రాజకీయం చేయాలని  చూసిన కుట్ర దారులకు బిసిలు సరైన బదులిచ్చారని స్పష్టం అవుతోంది.

రిపోర్టర్, సత్య.. మైలవరం