TV77తెలుగు పీలేరు:
భారత ప్రభుత్వ క్రీడా శాఖ ఉత్తర్వుల మేరకు చిత్తూరు నెహ్రూ యువ కేంద్రం వారి ఆదేశాలతో చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానము నందు "షీ" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక్కరోజు వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరకదారుఢ్యం కూడా పెంపొందించుకోవచ్చు అన్నారు. స్థానికంగా వివిధ కళాశాలల నుండి 9 టీములు పాల్గొన్నాయి. విన్నర్స్ గా ఎస్.అష్రఫ్ అలీ టీం,రన్నర్స్ గా సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీం నిలిచాయి. విన్నర్స్ రన్నర్స్ టీములకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లు, జ్ఞాపికలు,పతకాలు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేశారు. అంపైరింగ్ పి.ఈ.టి కిరణ్ కుమార్, జాకీర్ నిర్వహించారు. పై కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు డాక్టర్ పి.వి.ఎస్ లక్ష్మి, సీనియర్ అడ్వకేట్ డాక్టర్ రాయల సుధాకర్ రాయలు, రిటైర్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీ.శ్రీ రాములు, కాపునాడు నాయకులు డాక్టర్ మల్లికార్జున, పెప్సీ చలపతి, ఎన్.సి.సి కోఆర్డినేటర్ చంద్రబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.