ఆంధ్ర ప్రదేశ్ లో 24 గంటల్లో కరోనా కేసులు


TV77 తెలుగు అమరావతి :

 ఏపీలో 25,086క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా, 82మందికి పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా అత్య‌ధికంగా చిత్తూరు జిల్లా 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇక విజ‌య‌న‌గ‌రం, క‌డ‌ప జిల్లాల్లో కొత్త కేసులు న‌మోదు కాలేదు. 164 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,492 పాజిటివ్ కేసులు నమోదు. 20,60,836 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490కి పెరిగింది. మ‌రోప‌క్క ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే న‌మోద‌వుతున్నాయి.