వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ సెల్ -1 మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ -2 విభాగ లను తనిఖీ చేసిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి


 TV77తెలుగు  రాజమహేంద్రవరం :
సోమవారం అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ సెల్ -1 మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ -2 ఆఫీస్ లను తనిఖీ నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, డిఎస్పీ లకు సూచించడం జరిగింది. అలాగే ప్రాసిక్యూషన్, పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ విభాగాలు కలసి సమన్వయంతో పనిచేస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించవచ్చు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ తనిఖీలో  ఎస్పీ  ఎస్సీ, ఎస్టీ సెల్ -1 మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ -2 విభాగ ల రికార్డులను పరిశీలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే పాత UI కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని డిఎస్పి సెల్ -1 సిహెచ్ శ్యామల రావు, సెల్ -1 మరియు డిఎస్పి సెల్ -2 యం. భక్తవత్సలం గార్లకుతగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.అనంతరం ఎస్పీ  సైబర్ ల్యాబ్ ను సందర్శించి, ల్యాబ్ ఎక్విప్మెంట్/టూల్స్ ను పరిశీలించినారు.