వార్షిక తనిఖీల్లో భాగంగా క్రైమ్స్ డిఎస్పి ఆఫీసును తనిఖీ చేసిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి


  TV77తెలుగు  రాజమహేంద్రవరం :

అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి  గురువారం డిఎస్పి క్రైమ్స్ జోనల్ ఆఫీసును వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసి, క్రైమ్ స్టేషన్ల పని తీరును మరియు నేరస్థులకు సంబంధించిన రాత్రి పగలు ఇంటి చోరీలకు పాల్పడె దొంగలు, మోటార్ సైకిల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ మరియు ఈ మధ్యన కొత్త తరహాలో దోపిడీలకు, నేరాలకు పాల్పడే ముఠాల వివరాలను, అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల, మరియు ఇతర అంశాలపై డిఎస్పి క్రైమ్స్  జి.గురునాథ బాబు మరియు సి.సి.యస్ సి.ఐలతో చర్చించారు. ఈ తనిఖీలో భాగంగా ఎస్పీ  క్రైమ్స్ జోనల్ ఆఫీసు రికార్డులను పర్శిలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే పెండింగ్ గ్రేవ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని,  పాత కేసులలో నేరస్తులు ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీసి, వారి పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై నిఘా పటిష్టము చేయాలని, హిస్టరీ షీట్స్ నందు నేరస్తుల పూర్తి వివరాలు, వారి నేర చరిత్ర  ఎప్పటికప్పుడు నవీకరణ చేయాలని, క్రైమ్ కి సంబంధించిన అధికారులు మరియు సిబ్బంది రాత్రి సమయంలో నగరంలో గస్తి తిరుగుతున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తుల వేలుముద్రలను సేకరించి ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా పరిశీలించవలెనని,  జిల్లలో ఎక్కడైన  నేరం జరిగినట్లు తెలిసిన వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి నేరపరిశీలన చేయవలెనని అలాగే నేర నియంత్రణ లో బాగంగా అపార్ట్మెంట్ల వద్ద, ముఖ్య కూడలిలో సి.సి కెమెరాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, చోరి కేసులు చేదించి, నేరస్తులను పట్టుకోనుటలో ప్రతిభ కనబరచిన ప్రతి ఒక్కరికి తగిన ప్రోత్సహకాలు, రివార్డ్స్ ఇస్తానని అర్బన్ ఎస్.పి.  హామీ ఇచ్చి  వారి సమస్యలను అడిగి తెలుసు కొని, వాటి పరిష్కారానికి  క్రైమ్స్  డిఎస్పి కి తగు సూచనలు చేసినారు.