ప్రజల నమ్మకమే మా గెలుపు


 TV77తెలుగు కొండపల్లి :

20 వ డివిజన్ లో అనూహ్య పరిణామం...!!!

ప్రజల్లో ఉంటున్నాం గనుకే గుండెల్లో పెట్టుకున్నారు..!!!

చిత్తశుద్ధితో సంక్షేమం అమలు చేస్తున్నాం గనుకే ఓటు వేస్తామని చెబుతున్నారు...!!

ఇది నా మాట కాదు యావత్ మైలవరం నియోజకవర్గ ప్రజల మనసులో మాట...!!

20 వ డివిజన్ ప్రచారం లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఉద్గాటన...!!!

20వ డివిజన్ అభ్యర్థి మునగాల జ్యోతి కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే వసంత....!!!


ఎమ్మెల్యే గా గెలిచిన మొదటి రోజు నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాం గనుకే ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత 20వ డివిజన్ లో పర్యటించారు.ఈ సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ను కలిసిన ఒక మహిళ తన అంతరంగాన్ని ప్రజల ముందు బహిర్గతం చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం తో ప్రచారం చేశారు.అనంతరం ఎమ్మెల్యే వసంత మీడియా తో మాట్లాడుతూ ప్రజలకు మా పాలనపై నమ్మకం ఉందని అదే మా గెలుపుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయని వారు, ప్రజలను విస్మరించిన వారికి ఓట్లు అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు వస్తున్న జనాధరణ మాకు కొండంత బలమని చెప్పారు...అభివృద్ధి సంక్షేమం అమలు చేసి ఓట్లు అడుగుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు.


రిపోర్టర్,సత్య..మైలవరం