TV77తెలుగు కొండపల్లి :
సమస్యల వలయంలో కొండపల్లి మున్సిపాలిటీ...!!
పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ, మౌలిక సదుపాయాల కల్పన నూతన పాలకవర్గం ముందు ఉన్న ప్రధాన సమస్యలు....!!
సమస్యలు పరిష్కరించ లేక పోతే ప్రజా వ్యతిరేకత తధ్యం..!!
కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువులకు మరి కొంత సమయం పట్టినప్పటికీ దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే పాలకవర్గం ఎవరైనప్పటికి నూతనంగా భాద్యతలు చేపట్టే పాలకవర్గానికి అనేక పెను సవాళ్లు ముందు ఉన్నాయి అని చెప్పవచ్చు.సమస్యల వలయం లో కొట్టిమిట్టాడుతున్న యావత్ కొండపల్లి మున్సిపాలిటీ ప్రజానీకానికి నూతన పాలకవర్గం ఏర్పాటు తో ఊరట లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. కొండపల్లి వ్యాప్తంగా పారిశుధ్యం అమలు, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేయడం తో పాటు, ఇంటి ఇంటింటికీ తాగునీటి కుళాయి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక సమస్యలపై నూతన పాలకవర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ నీ పట్టి పీడిస్తున్న సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తి, పందుల సంచారం, కుక్కల స్వైర విహారం, కోతుల వీరంగం ఇలా అనే సమస్యలు మున్సిపల్ ప్రజలను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమైన ప్రజా సమస్యలపై నూతన పాలకవర్గం చిత్తశుద్ది తో పని చేయాల్సిన అవసరం ఉంది. సమస్యల కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న ప్రజలకు నూతన పాలకవర్గం ఎలాంటి ఊరట కలిగిస్తుందో వేచి చూడాలి .
రిపోర్టర్ ,సత్య.. మైలవరం