TV77తెలుగు రాజమండ్రి :
గురువారం స్దానిక ప్రియాంక గార్డెన్స్ నందు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో నిర్వహించారు, గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రతి కార్యకర్త సైనుకులుగా మారి పనిచేయాలని,గత టి.డి.పి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వై.ఎస్.ఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్ళాలని,అనేక ప్రాంతాల్లో కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడ వద్దని,ఈ అక్రమ కేసులు అన్ని న్యాయ స్థానంలో తెల్చుకుందామని,ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వెనుకడుగు వేయకుండా పార్టీకి అండగా నిలబడిన చాలా మంది కార్యకర్తలు ఉన్నారని,వారి అందరి త్యాగాలకు తగిన న్యాయం జరుగుతుందని,అమ్మ ఒడి పథకం ద్వారా 15,000/- రూపాయలు నెరుగా తల్లి బ్యాంక్ అకౌంట్ లోనే పడతాయి అని చెప్పి ఈరోజు అందులో 1,000/- మినహాయింపు చేసుకుని కుటుంబంలో ఒక్క పిల్లాడికే డబ్బులు ఇస్తున్నారని,కాలేజీలకు ఫీజు రియేంబర్స్ మెంట్ ప్రభుత్వం నుంచి చెల్లించడం లేదని,రాష్ట్రంలో 6లక్షల ఆటోలు ఉంటే 1.80 లక్ష యనబై వేల మందికి మాత్రమే 10,000/- వేశారని,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నెలకు 4,000/- వేలు రూపాయలు ఆటో డ్రైవర‌్ల దగ్గర అదనంగా వసూలు చేసుకుంటున్నారు,పోలిస్ చలానాల రూపంలో మరి కోంత,ఎస్.సి & ఎస్.టి బి.సి కార్పొరేషన్ల రుణాలు లేవు,రాష్ట్రంలో రోడ్లు అని గుంతలు పడి ఉన్న మరమ్మత్తులు చయలేని దుస్దితి,ప్రభుత్వం తరపున వర్క్స చెసిన ఏ ఒక్క కాంట్రాక్టర్స్ కి డబ్బులు చెల్లించడం లేదని,కరెంట్ బిల్లు,ఇంటి పన్ను పెంచి కోత్తగా చెత్త పన్నుని తెచ్చారని,రాష్ట్రం మొత్తం సారా,గంజాయి ధారాళంగా దోరుకుతుందని,చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో 2600/-వందలు ఉన్న ఇసుక ఇప్పుడు 11,000/- వేలకి పెంచిన ఘనత ఒక్క జగన్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మత్సేటి సత్స ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.