TV77తెలుగు కొండపల్లి :
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఊహించని పరిణామం...!!!
కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఫాం కావాలంటే టాస్ వేయాల్సిందేనా....???
ఇండిపెండెంట్ అభ్యర్థి పయనం ఎటువైపు...??
ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపి వైపు మొగ్గు చూపితే ఎమ్మెల్యే ఎక్సఫిషియ ఓటు తో మళ్ళీ సమానం అయ్యే ఛాన్స్....!!
ఎంపి ఎక్సోఫిషియ వినియోగించినట్టు సమాచారం..!!
ఉత్కంఠ భరితంగా సాగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పక్క అధికార పార్టీ వైసీపీ మరో పక్క టిడిపి మద్య జరిగిన హోరా హోరీ పోరులో వైసిపికి 14, టిడిపికి 14 సీట్లు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం తో ఇప్పుడు ఇరు పార్టీల కీలక నేతలు ఇండిపెండెంట్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరికి సపోర్ట్ గా నిలబడితే వారు కొండపల్లి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి అధికార పార్టీ వైసిపికి మద్దతు ఇస్తే 15 సభ్యుల బలం తో కొండపల్లి పురపాలక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా టిడిపికి సపోర్ట్ చేస్తే మళ్ళీ కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికార వైసీపీ చేతిలో 14 మంది అభ్యర్థుల బలం తో పాటు ఎమ్మెల్యే ఎక్సోఫిషియ ఓటు తో మళ్ళీ సంఖ్యా బలం సమానం అయ్యే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఇరు పార్టీలు సమానమైన బలం తో ఉండే అవకాశం ఉంది.. ఇద్దరు మళ్ళీ సమానం అయితే టాస్ కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇక ఇదే అంశం పై మరో వాదన తెరమీదకు వస్తోంది. ఎమ్మెల్యే ఎక్సోఫిషియ ఓటు వినియోగిస్తే.. తాము ఎంపి ఓటు వినియోగించి కొండపల్లి పాలక వర్గాన్ని ఫాం చేస్తామని ప్రతిపక్ష టిడిపి ధీమా తో ఉంది. కానీ ఎంపి ఎక్సోఫిషియ ఓటు వినియోగించారు అని, అసలు కొండపల్లి కి ఆయన ఓటు రిజిష్టర్ చేయలేదనే వాదన బలం గా వినిపిస్తోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపి వైపు వెళతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఎక్సోఫిషియ ఓటు తో టాస్ కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. మొత్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపి కి మద్దతు ఇస్తే కొండపల్లి పాలకవర్గం ఎన్నికకు టాస్ అనివార్యం లా కనిపిస్తోంది. మరి టాస్ కి వెళితే బ్యాటింగ్ ఎవరికి వస్తుంది.బౌలింగ్ ఎవరికి వెళుతుంది అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఇన్ని అవాంతరాల నడుమ ఎవరు పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తారు అనే అంశం పై సర్వత్రా చర్చనీయాంశం గా, మరింత ఆసక్తిగా మారింది. సేకరించిన సమాచారం మేరకు కథనం
రిపోర్టర్,సత్య..మైలవరం