TV77తెలుగు రాజమండ్రి రూరల్:
రాజమండ్రి హుకుంపేట పంచాయతీ పరిధిలో
రుడా అనుమతులు లేవు
పట్టించుకోని అధికారులు
నగరంలోనూ నగర పరిసర గ్రామాలలోని ఎటువంటి అధికారిక అనుమతులు ఇంటి ప్లానులు తీసుకోకుండానే అక్రమార్కులు అక్రమ నిర్మాణాలను ఏడేతగా కొనసాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు. పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదో మొక్కుబడిగా అక్రమ నిర్మాణాలను పట్టుకున్నట్లు వాటికి నోటీసులు ఇస్తున్నట్లు పైకి ఉద్యోగరీత్యా నోటీసు ఇవ్వడం తప్ప వాస్తవానికి అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన సంఘటన గాని భారీ ఎత్తున జరిమానాలు, వసూలు చేసిన సందర్భాలు గాని లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. సామాన్యులు. బలహీనులు 20, 30 గజాల లో అదనపు గదులు గృహ అవసరాలకు నిర్మించుకుంటే భద్రత ప్రమాణాలు అనుమతులు లేవని ఆల మేఘాలపై పోలీస్ బందోబస్తు తో సహా కూల్చి వేసే అధికారుల తీరు బడాబాబులు రాజకీయ నేతల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉదాసీనంగా ఉండిపోవడం ప్రజలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో హుక్కంపేట పంచాయతీ పరిధిలో బాలాజీ పేట సెంటర్ నుండి హైవే వెళ్లే మార్గంలో 15 అడుగుల ఉండే వీధిలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణాన్ని ఇటువంటి పంచాయతీ అనుమతులు. రూడా అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక హుక్కంపేట పంచాయతీ కార్యదర్శి భవన యజమాని కి నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణం కొనసాగించడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. భవన యజమాని కి స్థానికంగా కుల.ధన పరంగా అధికార పార్టీ నాయకుల అండ ఉండడంతో నోటీసులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇదే అదనుగా రూరల్ పంచాయితీలో వందలాది అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతూ కోట్ల రూపాయలు ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేత లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ భవన నిర్మాణాలు నుంచి భారీ స్థాయిలో జరిమానాలు వసూలు చేయాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మరోపక్క ముడుపులు మత్తులో పడి నిర్మాణాలు అక్రమ భవన నిర్మాణాలను పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా స్థానిక పంచాయతీ కార్పొరేషన్ అధికారులు అధికారులను పక్కనపెట్టి పక్కనపెట్టి ప్రభుత్వం నేరుగా విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయించి అక్రమ నిర్మాణాలను కూల్చి వెయ్యాలని లేదా భారీ స్థాయిలో జరిమానాలు వసూలు చేయాలని అప్పుడే అక్రమ భవన నిర్మాణాలు నిలిచిపోతాయని ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.