TV77 తెలుగు కొండపల్లి :
చైర్మన్ అభ్యర్థి పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నార్థకంగా తప్పుడు ప్రచారం...!!
సోషల్ మీడియాలో జరుగుతున్న వింత ప్రచారం పై టిడిపి కీలక నేతల ఆశ్చర్యం...!!
కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ టిడిపి కీలక నేత సందేశం...!!
తప్పుడు ప్రచారాన్ని భుజాన వేసుకున్న ఇబ్రహీంపట్నం లోని కొన్ని మీడియా రిపోర్టర్లు...!!
ప్రజలను, గెలిచిన అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఇబ్రహీంపట్నం టిడిపి నేతల మైండ్ గేమ్ అంటూ వైసీపీ నేతల మండిపాటు....!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంత వరకు కొండపల్లి మున్సిపాలిటీ లో ఏ పార్టీ పాలక వర్గం ఏర్పాటు చేస్తుంది అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ టిడిపి తరుపున చైర్మన్ అభ్యర్థి గా కొందరు పేర్లను ప్రస్తావిస్తూ ఊహాజనిత వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశం పై నియోజకవర్గ టిడిపి కీలక నేత ఒకరు జరుగుతున్న ప్రచారం పై స్పందించారు. చైర్మన్ అభ్యర్థికి సంభందించిన ఎలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకోలేదని సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. అయితే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గా టిడిపి తరుపున ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇబ్రహీంపట్నం కు చెందిన కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని..ఇదంతా టిడిపి నేతల మైండ్ గేమ్ అంటూ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి , టిడిపి తరుపున గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త పడటం కోసం టిడిపి నేతలు కావాలనే పొంతన లేని ప్రచారం చేస్తున్నారు అని మండిపడుతున్నారు.టిడిపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారానికి ఒక వర్గం మీడియా వారికి కొమ్ము కాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క సమాచారం వార్తలు పెట్టాలని హిత బోధ చేస్తున్నారు.
రిపోర్టర్,సత్య..మైలవరం