TV77తెలుగు కడియం :
తూర్పుగోదావరి జిల్లా కడియపులంక సత్యదేవ నర్సరీ ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఐఎఎస్ ఆదివారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో విచ్చేసిన ఆయన నర్సరీలో సుమారు రెండు గంటలపాటు గడిపారు.కొన్ని రకాల మొక్కలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆయనకు నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు,వీరబాబు మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నర్సరీల అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎప్పటినుంచో ఈ ప్రాంతాన్ని చూడడానికి రావాలనుకుంటున్నానని చాలా మంది సహచర ఐఎఎస్ అధికారులు ఈ నర్సరీల గురించి తెలుపారన్నారు. తాజాగా అనుపమ అంజలి, అభిషేక్ కిషోర్ లు నర్సరీల గురించి చెప్పారన్నారు.తాను ఊహించిన దానికంటే ఇక్కడ నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఆయన వెంట గృహ నిర్మాణ శాఖ ఇఇ సోములు,డిఇ పరశురామ్,ఎఇ సత్యనారాయణమూర్తి రెవిన్యూ ఇన్స్పెక్టర్ జానికీ తదితరులు ఉన్నారు.