TV77తెలుగు కొండపల్లి:
ఒక హిజ్రాతో మొదలై మరి కొంత మంది హిజ్రాలు ఎన్నికల బరిలో..??
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ట్రాన్స్ జెండర్ నందితా వర్మ (సమంత)...!!
17 వార్డు నుండి బిజేపి తరుపున బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఎన్నికల సితార...!!!
నాడు కాంగ్రెస్ పార్టీ తరుపున వార్డు నెంబర్ గా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ తల్లి...!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది..గతం లో ఎన్నడూ లేని విదంగా ఒక హిజ్రా ఎన్నికల బరిలో నిలిచారు.ఇబ్రహీంపట్నం ఫెర్రీ కి చెందిన వల్లభనేని నందితా వర్మ అలియాస్
( సమంతా) కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు బిజేపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతం లో జరిగిన ఇబ్రహీంపట్నం పంచాయితీ ఎన్నికల్లో హిజ్రా తల్లి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసినట్లు చెబుతున్నారు. ఇక అదే రాజకీయ నేపథ్యంతో ఇప్పుడు కొండపల్లి పుర పోరులో నిలబడి అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు.కొండపల్లి రాజకీయ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా కొత్త సాంప్రదాయంగా ఒక హిజ్రా ఎన్నికలల్లో పోటీ చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.అయితే ఈ సాంప్రదాయం సమంతా ఒక్కరితో ఆగదని ఇంకా అదే బాటలో మరికొందరు హిజ్రాలు ఉన్నట్లు ప్రచారం జరగడం గమనార్హం.
రిపోర్టర్, సత్య.. మైలవరం