TV77 తెలుగు కొండపల్లి :
నాడు బిసి పక్షపాతి... నేడు వివక్ష ఖ్యాతి....!!
కొండపల్లి మున్సిపల్ ఎన్నిక పరాభవం... పెను మార్పులకు శ్రీకారం...!!!
నాడు బిసిలను భుజానకేసుకున్న నేత అన్నారు..!!!
నేడు అదే బిసిలను అణచివేస్తున్న నేత అంటున్నారు....!!!
నాడు బిసిల విగ్రహాలు పెట్టలంటేనే నిరాహార దీక్షలు చేసే దుస్థితి....!!
నేడు అదే బిసిలు ప్రజా ప్రతినిధులు గా అనుమతులు వారే ఇచ్చే పరిస్థితి....!!
ఎమ్మెల్యే వసంత పై బిసిల అణచివేత మరక సాధ్యమేనా...??
బిసిలకు శిఖరాగ్రాన నిలబెట్టిన నేతకు ఇలాంటి మరకలు వర్తిస్తాయా....!!!
మైలవరం "కుల" కుట్ర రాజకీయాలపై స్పెషల్ స్టోరీ...!!
"" నిన్నటి దాకా శిలనైన నీ పదము సోకి నే గౌతమి నైనా"" ...అంటూ ఒక హిట్ సాంగ్ ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది కదా.. సరిగ్గా ఇదే పాట బహుశా మైలవరం నియోజకవర్గం లోని బిసిలకు వర్తిస్తుందేమో.నిన్న మొన్నటి దాకా బిసిల పక్షపాతి అని పిలుచుకున్న నేతను నేడు ఒక వ్యతిరేక వాదిగా, ఒక అణచివేత వాదిగా, చిత్రీకరించడం జరుగుతోంది. అసలు మైలవరం నియోజకవర్గం లో ఎం జరుగుతోంది.ఎందుకు ఈ అలజడి.కుల కుట్ర రాజకీయాలకు ఆద్యం పోస్తున్నది ఎవరు.దీని వలన ఎవరికి లబ్ధి , ఎవరికి నష్టం.. ఒకసారి పరిశీలన చేద్దాం. మైలవరం నియోజకవర్గం లో గత ఐదేళ్ల ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆ లెక్కలు ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఎవరు పక్షపాతి, ఎవరు వ్యతిరేక వాది అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్ల టిడిపి పాలనలో ఒక మంత్రి హోదా ఉన్నప్పటికీ బిసిలు ఒక విగ్రహం పెట్టుకోవాలి అంటే ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేసుకోవాల్సిన దుస్థితి... నేడు ఒక ఎమ్మెల్యే హోదాలో అంతా తానే అయ్యి బిసిల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.ఈ మాట యావత్ బిసిల తరుపున ఒక మహాసభలో బిసి నాయకుడు చేసిన వాఖ్యలు.జాతిని జాగృతం చేసిన మహనీయుడు జ్యోతి రావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని దీక్షలు చేసిన బిసి నేతలపై లాఠీ ఝులిపించిన నాటి పాలకులు.ఇప్పుడు అదే బిసిలపై కపట ప్రేమ చూపిస్తూ కుల కుట్ర రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారు. కానీ బిసిలకు ఎవరు ఎంత చేశారు.ఎవరు అణచివేసి తొక్కి పెట్టారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటివరకు ఎం చేశారు, ఎంత చేశారు అనేది మాటలలో కాదు గణాంకాలు చెబుతున్నాయి.వినాశకారే విపరీత బుద్ధి అనే ధోరణి తో కుల కుట్ర రాజకీయాలు చేస్తున్న కుయుక్తులు తప్పక గ్రహించాలి. మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మెజారిటీ ఓటింగ్ ఉన్న బిసిలను చిన్న చూపు చూసింది ఎవరు.అదే బిసి లను శిఖరాగ్రాన నిలబెట్టిన నాయకుడు ఎవరు అనేది పూర్వపరాలు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.గడిచిన రెండున్నర ఏళ్ల పాలన లో బిసిలకు పెద్దపీట వేస్తూ అనేకమైన ఉన్నత పదవులు, నామినేటెడ్ పదవుల తో పాటు ప్రజా ప్రతినిధులు గా, గ్రామ సర్పంచ్ లుగా, ఎంపీటీసీ లుగా, వార్డు సభ్యులుగా, నేడు మున్సిపాలిటీ కౌన్సిలర్ లుగా అవకాశాలు ఏ సామాజిక వర్గానికి దక్కని గౌరవం దక్కింది. సీట్ల పంపకాలు కానీ, పదవుల జాబితా లో కానీ, ఎక్కడ కూడా బిసిలను తక్కువ చేయలేదు అనేది వైసీపీ లోని బిసి నేతల మాట. మరి బీసీ లకు ఎక్కడ అన్యాయం జరిగింది. ఎక్కడ బిసిలను తక్కువ చేసినది. ఎమ్మెల్యే వసంత బిసిలను అణచివేస్తున్నారు అంటూ కొందరు కుట్ర దారులు వేస్తున్న "మరక " నమ్మదగినదేనా.??
ఒక్క ఎన్నిక... నేతల్లో అంతరంగాన్ని ఆవిష్కరించింది..
ఎవరు ఎంటి అనే లోగుట్టు బయట పెట్టింది...
ఈ వివరాలు...మరో సంచలన కథనం లో
రిపోర్టర్, సత్య..మైలవరం