TV77తెలుగు రాజమండ్రి :
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న జగన్ ప్రభుత్వం..
అవినీతి అక్రమాలకు అడ్రస్ గా పాలన
మాజీ ఎంపీ ఉండవల్లి విమర్శ..
రాష్ట్రంలో గతంలో ఎవరు ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని. ప్రజలను అప్పుల్లోకి నెడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆస్తులు అప్పులు నిష్పత్తి ( ఎఫ్ ఆర్ ఎన్ బి ) నిబంధనలు అతిక్రమించి విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవడం దారుణమన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ ధర్మం చర కమ్యూనిటీ హాల్ లో శనివారం ఉండవల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మించి 3 శాతం అదనంగా పలురకాల కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయడం ప్రజలకు ట్రస్టీగా ఉండే ప్రభుత్వానికి తగిన పని ఉండవల్లి అన్నారు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రానికి అప్పుడు కొట్టదని అన్నారు ప్రజా సమస్యలకు విధానపరమైన చర్చలకు కేంద్రస్థానంగా ఉండాల్సిన అసెంబ్లీ గౌరవమర్యాదలు బ్రష్టు పట్టే విధంగా అధికార పక్షం ప్రతిపక్షం వాళ్లు వ్యవహరించడం తగదన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం సరైన విధానం కాదు అన్నారు రాష్ట్ర మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భాషా ప్రయోగాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియంత్రించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన యదేచ్చగా జరుగుతుందని ఇసుక మద్యం ఆదాయమే ఇందుకు కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా పోలవరం నిధులు హైదరాబాద్ మిగులు నిధులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి జగన్ విఫల ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్లు వచ్చే ఎన్నికల్లో జగన్ ఇదే విధానాలు కొనసాగిన అయితే సీట్లు తిరగబడతారని అన్నారు. చంద్రబాబు పరిపాలనలో సాధించలేని విధులు హోదాలు తేలేదు అని విమర్శిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు అవి సాధించలేదని ఉండవల్లి ప్రశ్నించారు ఏదిఏమైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్ ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.