TV77తెలుగు కొండపల్లి :
నిన్న టిడిపి నేడు వైసీపీ...!!!
గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకుపోతున్న అభ్యర్థులు...!!
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ..!!
నేటి సాయత్రం 3 గంటల సమయానికి కార్యాలయం లోపలికి చేరితే రాత్రి సమయం పట్టినా నామినేషన్లు స్వీకరణ
ప్రతిష్టాత్మక కొండపల్లి పుర పోరులో ఆయ పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు. ప్రధానంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టిడిపి మద్య పోటీ నెలకొనగా విపక్షాలు సైతం అభ్యర్థులను నిలబెట్టి తమ సత్తువ చూపేందుకు సిద్ధం అయ్యారు. మొత్తం 29 వార్డులకు గాను ఇప్పటివరకు టిడిపి, జనాసేన, బిజేపి, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు వైసీపీ అభ్యర్దులు పెద్ద ఎత్తున నామినేషన్ల వేయడానికి సిద్ధమయ్యారు. నిన్న టిడిపి అభ్యర్థులు గంప గుత్తగ నామినేష్లను వేయగా నేడు వైసీపీ అభ్యర్థులు సైతం అన్ని వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈరోజు సాయత్రం మూడు గంటల సమయానికి కార్యాలయం లోపలికి చేరుకొగలిగితే రాత్రికి ఎంత సమయం అయినా సరే నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు.
రిపోర్టర్, సత్య.. మైలవరం