TV77తెలుగు హైదరాబాద్ క్రైమ్ :
ఇబ్రహీంపట్నంలో పరిధిలో వెంకటేశ్ (45) అనే వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి ఉంటున్నాడు కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కామెర్లతో బాధపడుతున్న భార్య శనివారం నగరంలోని ఆసుపత్రికి వెళ్లి బంధువుల ఇంట్లో ఉండిపోయింది. ఆ రోజు రాత్రి మద్యం తాగిన మత్తులో ఇంటికి వచ్చిన వెంకటేశ్ కుమార్తెపై కన్నేశాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఇంటి బయట కూర్చుని ఏడుస్తుండగా స్థానికులు ఆరా తీయగా. జరిగిన విషయాన్ని వారికి చెప్పడంతో అందరూ కలిసి వెంకటేశ్‌ను బయటకు ఈడ్చుకొచ్చి సమీపంలోని కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి నిందితుడిని అప్పగించారు. వెంకటేశ్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు.