TV77తెలుగు రంపచోడవరం:
బుల్లోరా వాహనం. 18.లక్షల విలువ గంజాయ్
తూర్పుగోదావరి జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబుఆదేశాల మేరకు, క్రిష్ణ కాంత్ పటేల్, ASP, రంపచోడవరం వారి ఉత్తర్వులు ప్రకారం మత్తు పదార్ధాలు, గంజాయి, సారా లకు వ్యతిరేకంగా పరివర్తన కార్యక్రమం గురువారం మద్యాహ్నం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 గంటల ప్రాంతములో రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చిన సమాచారం మేరకు ఎస్ ఐ రాజవొమ్మంగి తన సిబ్బంది, మధ్యవర్తులు తో కలిసి బోయపాడు జంక్షన్ కి వెళ్ళగా, అక్కడ అనుమానాస్పద రీతిలో AP 31 TG 2571 నెంబర్ గల బోలెరో వాహనంను ఎవరో గురు తెలియని వ్యక్తులు వదిలిపారిపోయినట్లు ఉండి, సదరు వాహనంలో సుమారు 605 కేజిలు బరువు కలిగిన గంజాయి మూటలను గుర్తించి, మధ్యవర్తుల సమక్షంలో గంజాయిని, వాహనంను స్వాధీన పరుచుకుని,తగు చర్య నిమిత్తం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ నందు Cr. No. 103/2021 u/s 8 (c) 1/w 0)(I) (C) of NDPS Act గా కేసు నమోదు చేసి, ముద్దాయిలు కోసం విచారణ కొనసాగుతుంది. మొత్తం గంజాయి విలువ 18,15,000/-