TV77తెలుగు రాజమహేంద్రవరం :
అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, గురువారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం నందు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఫూల మాల వేసి ఘన నివాళులర్పించినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రత్న అవార్డు గ్రహీత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన స్వాతంత్ర్య పోరాటానికి మరియు దేశ నిర్మాణానికి, దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. అయన జన్మదినాన్ని" మైనారిటీస్ వెల్వఫర్ డే " గా కూడా జరుపుకుంటున్నామని తెలియపరచినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లా&ఆర్డర్ కె.లతా మాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ పాపారావు,ఏ ఓ చంద్రశేఖర్, డిఎస్పీ వి.సత్తిరాజు, సి.ఐలు, అర్.ఐలు, యస్.ఐలు, మినిస్టీరియల్ ఉద్యోగుల మరియు సిబ్బంది పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీ, చిత్రపటానికి నివాళులర్పించినారు.