TV77తెలుగు గద్వాల :
రైతు బిడ్డను ప్రోత్సహించండి
జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్
భారీగా హాజరైన అభిమానులు
రైతు బిడ్డ నటించిన ఊరికి ఉత్తరాన సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజిత్ రతన్ కుమార్ కోరారు. ఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య మరియు రాచాల యుగంధర్ నిర్మించిన ఊరికి ఉత్తరాన సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమం శనివారం గద్వాల పట్టణంలోని హిమాలయ బాంక్వెట్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ చేతుల మీదుగా చిత్రం లోని "రెక్కలే వచ్చినట్టు ఉందే అనే లిరికల్ వీడియో సాంగ్ ను"ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ యూనిట్ సభ్యులను అభినందించారు, ప్రస్తుతం యువతను తప్పుదారి పట్టిస్తున్న డ్రగ్స్ మీద సినిమా చేయాలని యూనిట్ కు సూచించారు. ఈ చిత్ర నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాలో జరిగిన ఒక యదార్థ సఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. సినిమా చాలా అద్భతంగా వచ్చిందని, కార్తీక పౌర్ణమి సంద్భంగా నవంబర్ 19న సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అందరూ థియేటర్ లోనే సినిమా చూసి ఆదరించాలని కోరారు. హీరో నరేన్ మాట్లాడుతూ ఒక రైతు బిడ్డ ఈరోజు మీ ముందు నిలబడ్డాడని అందరూ తనని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బివిఎం గణేష్ రెడ్డి, సిఐ భాషా, హీరోయిన్ దీపాలి శర్మ , జబర్దస్త్ ఫణి, మరియు రచయితలు నాగమణి రాజు ,ఉదయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.