TV77తెలుగు కొండపల్లి :
కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయాలలో కొత్త ముఖ చిత్రాలను తెర మీదకు తీసుకొస్తున్న వైసీపీ...!!!
అన్ని సామాజిక వర్గాల్లో బలం పెంచుకునేందుకు ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్న వైసీపీ శ్రేణులు....!!!
టిడిపి వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న మైనార్టీ నేతలు...!!!
కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కొండపల్లి పురపాలక ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీని ఢీ కొట్టడానికి సిద్దంగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ కార్యకర్తలు ఊహించని షాక్ ఇచ్చారు.ఇప్పటివరకు టిడిపి నాయకులుగా, క్రియాశీల కార్యకర్తలుగా పని చేసిన వారు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునెందుకు సిద్ధం అయ్యారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతున్న వైసీపీ అందరికీ సమ న్యాయం చేస్తూ వస్తుంది.ఈ క్రమంలో నేడు మైనార్టీ వర్గాల నుండి నేడు పెద్ద ఎత్తున వైసీపీ లోకి వలసలు జరగనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.నువ్వా నేనా అన్నట్లు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపొందేందుకు అధికార వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.అందుకోసం కొత్త ముఖ చిత్రాలను మున్సిపల్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అంతే కాకుండా మైనార్టీ వర్గాల్లో మరింత బలపడేందుకు వైసీపీ క్రియాశీలకంగా పని చేస్తోంది. కొండపల్లి వేదికగా నేడు జరగబోయే సమావేశం లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమక్షంలో మైనార్టీ నేతలు వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
రిపోర్టర్ , సత్య ..మైలవరం