రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఏలుతుంది పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గం కాశి నవీన్ కుమార్


 

 TV77తెలుగు  రాజమహేంద్రవరం:

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా దాడులను చూస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఏలుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు.అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై,విశాఖలో పార్టీ కార్యాలయం పై,పార్టీ నేత పట్టాభి నివాసంపై వూకాపా నేతల దాడులను ఆయన ఖండించారు.రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డూ అదుపూ ఉండటం లేదని, పరిపాలన చేతకాక ప్రశ్నించిన పార్టీ పై,నాయకులపై దాడిని ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.ఈ అరాచక పాలన చూస్తే వైకాపాకు రోజులు దగ్గరపడ్డాయన్న విషయం అర్ధమవుతుందని పేర్కొన్నారు.పులివెందుల ఫ్యాక్షనిజం రాష్ట్రమంతా జగన్ చూపిస్తున్నారని అన్నారు.ప్రజల సమస్యలను గాలికొదిలేసిన జగన్ ప్రజల పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ పై విషం చిమ్ముతున్నారని,గుండాల్లా దాడులు చేస్తున్నారని అన్నారు.చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని, జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.