మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా...??
మా ముఖ్య మంత్రి దాడులకు ప్రేరేపించి ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలకు తెలియదా....!!!
వైసీపీ నిరసన ప్రదర్శన లో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి....!!!
TV77తెలుగు మైలవరం:
తమకు తామే దాడులు చేసుకొని ఆ బురద వైసీపీ పై చల్లెందుకు చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర వైసీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టిడిపి కార్యాలయాల పై జరిగిన దాడులను ఖండిస్తూ రాష్ట్ర టిడిపి బంద్ కు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో లో వైసీపీ ప్రతిగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అందులో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన నిరసన ప్రదర్శన లో నాగిరెడ్డి మాట్లాడుతూ టిడిపి ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు అనైతికమని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమకు తాము దాడులు చేసుకొని సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడులకు ప్రేరేపించి ఉండి ఉంటే రాష్ట్రం లోని శాంతి భద్రతలు అదుపు ఉంటాయా అని ప్రశ్నించారు.చంద్రబాబు అండ్ కో ఉద్దేశపర్వకంగానే దాడులకు పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఆరోపించారు.ఇప్పటికైనా క్షుద్ర రాజకీయాలు పక్కన పెట్టీ ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని సూచించారు.
రిపోర్టర్, సత్య మైలవరం