TV77తెలుగు రాజమహేంద్రవరం :
పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సోమవారం కోవిడ్ పాండమిక్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు వైరస్ నిర్మూలనలో శ్రమిస్తు విధినిర్వహణలో కరోనా మహమ్మారి బారినపడి వైరస్ తో పోరాడుతూ అమరులైన హోమ్ గార్డ్ మేడిశెట్టి నారాయణ రావు నివాసానికి (స్పిన్నింగ్ మిల్ కాలనీ హౌసింగ్ బోర్డ్) కు వెళ్లి అయిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకొని, వారికి ఏ అవసరమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినారు.