వనితా శక్తికి పట్టాభిషేకం

మండల గ్రామ రాజ్యాధికారం లో మహిళా మణిలకే పెద్దపీట వేసిన ఎమ్మెల్యే వసంత....!!!
 
 జూపూడి గ్రామం లో దాదాపుగా అందరూ మహిళా ప్రజా ప్రతినిధులే....!! 

మహిళా ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన జూపూడి గ్రామ వైసీపీ నేతలు, అధికారులు...!!! 

TV77తెలుగు  మైలవరం:
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాజ్యాధికారం దక్కించుకున్న వారిలో దాదాపుగా అందరూ మహిళలే ఉన్నారు. ఆశయాలు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వి ఆచరణ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వి అన్నట్లు మహిళ లకే ఉన్నత పదవులు కట్టబెట్టారు.మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిపి పదవులు దాదాపుగా మహిళలకే ఇవ్వడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జూపూడి గ్రామ వైసీపీ నేతలు మహిళా ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా గరికిపాటి శ్రీదేవి, మండల పరిషత్ ప్రెసిడెంట్ గా పాలడుగు జ్యోత్స్న మండల పాలకులుగా ఉండగా ఇక జూపూడి గ్రామం లో దాదాపుగా అందరూ మహిళా ప్రజా ప్రతినిధులు ఉండటం గమనార్హం. జూపూడి గ్రామ సర్పంచ్ కాకి దేవమాత, ఎంపిటిసి బాల నాగమ్మ తో పాటు అదే గ్రామానికి చెందిన పోలగంగు రాణి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు... ఈ పంచ మహిళా శక్తులను గ్రామ వైసీపీ నేతలు, అధికారులు ఘనంగా సన్మానిచారు...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరై మహిళా ప్రజా ప్రతినిధులను అభినందించారు. ప్రజా పాలన నిరంతర ప్రాయంగా కొనసాగించాలని సూచించారు. 
రిపోర్టర్..
సత్య. మైలవరం