పిడి.ఎస్. యూ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ పోరుబాట


 పిడి.ఎస్. యూ  ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ పోరుబాట

ఖాళీలు మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలి

TV77తెలుగు  రాజమహేంద్రవరం :

రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని పిడి.ఎస్. యూ,పి.వై.యల్. సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ పోరుబాట నిరసన కార్యక్రమం జరిగింది. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయాలని వసతి దీవెన పథకాన్ని అమలు చేయాలని ఫీజుల దోపిడీని అరికట్టాలని జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని ఖాళీలు మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలని బ్లాక్ పోస్ట్లు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిడి.ఎస్. యూ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రైవేటు విద్యాసంస్థలు వీధుల దోపిడీ జరుగుతుందని ప్రభుత్వా హాస్టల్స్ అధ్వానంగా ఉన్నాయని అన్నారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ పొంతన లేకుండా ఖాళీలను భర్తీ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిడి.ఎస్. యూ,పి.వై.యల్. నాయకులు బి. చిట్టిబాబు, కే భాను ప్రసాద్, ఐ. చంద్ర శేఖర్, కె. లక్ష్మణ్, ప్రదీపు తదితరులు పాల్గొన్నారు.