కోవిడ్ పాండమిక్ లో కర్ఫ్యూ డ్యూటీలు గురించి విద్యార్థుల అభిఫ్రాయాలను అడిగి తెలుసుకున్నా అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి


 

TV77తెలుగు  రాజమహేంద్రవరం:

పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, ఈ రోజు ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీసు కార్యాలయంలో "కోవిడ్ పాండమిక్ సమయంలో నిస్వార్థంగా సేవ చేసిన పోలీసులు" అను అంశం పై  వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి, విద్యార్థులతో స్వయంగా అనుసందానం అయి పోలీసు శాఖ పనితీరును వారికీ వివరించి, విద్యార్థుల్లో పోలీసింగ్ పై అవగాహన కల్పించినారు, అలాగే కోవిడ్ పాండమిక్ లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా వైరస్‌ నిర్మూలనలో పోలీసులు 24 గంటలూ శ్రమిస్తు చేసిన కర్ఫ్యూ డ్యూటీలు గురించి విద్యార్థులకు వివరిస్తూ పాండమిక్ సమయంలో పోలీసు వారు చేసిన సేవల గురించి విద్యార్థుల అభిఫ్రాయాలను ఎస్పీ  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్)  కె.లతా మాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్  సి.హెచ్ పాపారావు, ఎఆర్ డిఎస్పీ వి. సత్తిరాజు ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరైనారు.