TV77తెలుగు రాజమహేంద్రవరం :
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలను మరియు భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సీహెచ్ పాపారావు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రారంభించారు, ఈ కార్యక్రమం డి.పి.ఓ నుంచి ప్రారంభమై జె.యన్ రోడ్, ఎ.వి రోడ్, సి ఆర్ పి ఎఫ్ క్యాంప్ రోడ్, డి.పి.ఓ వద్ద ముగిసింది. 3 కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా జరుపుకోవడం జరుగుతుందని, అందరం కలిసి దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు కృషి చేయాలని అర్బన్ జిల్లా అధికారులకు, సిబ్బందికి సూచించడం జరిగింది.