TV77తెలుగు కొండపల్లి
విమర్శనాస్త్రాలు ఎగ్గుపెట్టండి..!! అభివృద్ధి మంత్రాలు జపించండి...!!
ఓటరు నాడి పట్టండి.!! గెలుపు గుర్రాలను బరిలో నిలబెట్టండి..!!
ప్రజా క్షేత్రం లో మీ బలం ఎంత.. ప్రత్యర్థి బలం ఎంత అంచనా వేయడం...!!
అంతిమంగా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నగారా కు సన్నద్ధం కండి...!!
రేపు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్..???
అత్యంత ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. వచ్చే వారం లో నోటిఫికేషన్ ఉంటుందని అధికారులు సమాచారం మేరకు రేపటి నుండి కౌంట్ డౌన్ షురూ అయింది.రేపు నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయ వార్డుల్లో నిలబడుతున్న అభ్యర్థుల హడా విడి మొదలైపోయింది.అయితే జరుగుతున్న ప్రచారం మేరకు అనుకున్నట్లుగా నోటిఫికేషన్ రేపు విడుదల అవుతుందా లేక పండగ తరువాత చేస్తారా.అసలు ఎప్పుడు చేస్తారు అనేది మాత్రం ఇప్పటి వరకు అధికారుల నుండి స్పష్టమైన సమాచారం మాత్రం లేదు.అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అభ్యర్థులు సిద్దంగా ఉండాలని ఆయ పార్టీల అధినేతలు సూచిస్తున్నారు.
రిపోర్టర్, సత్య ... మైలవరం