చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు కొనసాగిస్తున్న చిల్లకల్లు పోలీసులు


 TV77తెలుగు  జగయ్యపేట:

కృష్ణా జిల్లా ఎస్పి సిద్ధార్థ కౌశల్   ఆదేశాల మేరకు, నందిగామ డి.ఎస్.పి.నాగేశ్వర రెడ్డి  పర్యవేక్షణలో, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ ఆద్వర్యంలో చిల్లకల్లు ఎస్ ఐ పి.రమేష్  రహస్య సమాచారం సేకరించి ఒక మోటార్ సైకిల్ పై తెలంగాణా నుండి ఆంధ్రా ప్రాంతానికి మద్యం అక్రమ రవాణా చేస్తుండగా సిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను మల్కాపురం  నందు ఆకస్మికముగా వాహనములు తనిఖీ చేసి అక్రమంగా మధ్యం బాటిల్స్ ను రవాణా చేయుచున్న జగ్గయ్యపేట మండలం, మల్కాపురం గ్రామంకు  చెందిన  1. నడికొప్పుల వీరబాబు, 2. లింగనబోయిన రమేష్, అను వారిని  అరెస్ట్ చేసి వారి  నుంచి Rs. 45,600/- విలువ చేసే 380 మధ్యం బాటిల్స్ ను పోలీసులు  స్వాదీన పరుచుకుని  ముద్దాయిలను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం  జరిగింది. అక్రమ మద్యం తెచ్చి అక్రమార్జన చేయాలి అనుకునేవాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు మరియు రౌడీషీట్లు తెరవడానికి వెనకాడబోమని, అదేవిధంగా, అలా పునరావృతం చేసినవారిని ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం చేపట్టిన అక్రమ మధ్య నిషేధం పాలసీ కి ఎవరూ అతీతులు కాదని, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని ఈ సందర్భంగా చిల్లకల్లు ఎస్ ఐ పి .రమేష్  తెలియజేసారు.