జాతి పిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతినీ పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మహాత్మా గాంధీ, భారత దేశం రెండవ ప్రధాని స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు .ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సంపాదించడానికి అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ అన్నారు. గాంధీ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అందుకే ఆయన జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరినో తన ఉద్యమస్ఫూర్తిని రగిల్చారు. లాల్ బహాదుర్ శాస్త్రి భారత దేశ రెండవ ప్రధాన మంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారని వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం యువత వారి ఆదర్శాలను పాటించాలని జిల్లా ఎస్పీ తెలియ చేసినారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయ రామరాజు , ఏ.అర్ అదనపు ఎస్పీ బి.రామ కృష్ణ , ఏ.అర్ డిఎస్పీ కృష్ణంరాజు, ఎస్.బి ఇన్స్పెక్టర్ సి హెచ్ కొండల రావు , అర్. ఐ లు మనోహర్,కృష్ణంరాజు ఎం.రాజ అర్.ఎస్. ఐ లు పోలీస్ సిబ్బంది పాలగోన్నారు.
మహాత్మా గాంధీ లాల్ బహాదుర్ శాస్త్రి లకు పోలీసులు నివాళి
urria 02, 2021
TV77తెలుగు ఏలూరు: