నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అగ్ర నేతలను పోటీకి సిద్దం చేస్తున్నారా ?


 అభ్యర్థులు లేరు అంటూనే..!!!


బలమైన అభ్యర్థులను మున్సిపల్ బరిలో నిలబెడుతుందా...??


నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అగ్ర  నేతలను పోటీకి సిద్దం చేస్తున్నారా...??


అపారమైన రాజకీయ అనుభవం, వాక్ చతురత కలిగిన ఆ నేత బరిలో దిగితే గెలుపు దోబూచులాట తప్పదా..??

TV77తెలుగు  కొండపల్లి:

ప్రతిష్టాత్మక కొండపల్లి పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్ష టిడిపి గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పైకి అభ్యర్థులు కొరత ఉంది అంటూ పెదవి విరుస్తున్న తెలుగు తమ్ముళ్లు తెర వెనుక మాత్రం గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీని ఓడించి పురపాలక సంఘం కైవసం చేసుకోవడం కోసం అభ్యర్థుల జాబితాను సైతం గోప్యత పాటిస్తున్నట్లూ సమాచారం.మైలవరం నియోజకవర్గానికి సెమీ ఫైనల్ తరహాలో జరుగుతున్న కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి తన మార్క్ రాజకీయాన్ని సరికొత్తగా పరిచయం చేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం రాజకీయాలలో అత్యంత కీలకమైన నేతలను తెరమీదకు తీసుకొస్తున్నట్లూ కనిపిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన రోల్ పోషించిన విజయనాయకుడు నీ రంగంలోకి దింపుతున్నట్లు ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడు ప్రజా క్షేత్రం లోకి వస్తే ఆయన వాక్ చతురతకు ప్రజలు ఆకర్షితులు అవుతారు అనే అంచనాలు ఉన్నాయి. రాజకీయంగా ఏళ్ల నాటి అనుభవం , ప్రజలను తన వైపు తిప్పుకోగల వాగ్ధాటి టిడిపి విజయావకాశాలు రెట్టింపు చేస్తుంది అనేది టిడిపి అధినాయకత్వం వ్యూహం లా కనిపిస్తోంది. అధికార వైసీపీ హవా కొనసాగుతున్న తరుణం లో టిడిపి వ్యూహ రచన ఎంత మేర పనిచేస్తుంది అనేది వేచి చూడాలి.  

రిపోర్టర్ సత్య. మైలవరం