ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంపీ కాన్వాయ్ డ్రైవర్లు


 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంపీ కాన్వాయ్ డ్రైవర్లు


ఇరుకు రోడ్లో  దూసుకుపోయిన ఎస్కార్ట్ వాహనం ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్న వృద్ధుడు 


బాధ్యతా రహితంగా రేష్ డ్రైవింగ్


సామాన్యులపై  ప్రతాపం చూపే పోలీసులకు ఇలాంటివి పట్టవేమో! 

 TV77తెలుగు   రాజమహేంద్రవరం :

 పురాతన రాజమండ్రి నగరం ఇరుకు రోడ్లు, జనం రద్దీ తో ఉంటాయి.  ఇలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం నెమ్మదిగా వెళ్లాల్సిన క్రమంలో  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ , కాన్వాయ్ మరింత జాగ్రత్తగా ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎంపీ, ఆయన  అనుచరులు , ఎస్కార్ట్ వాహనాల డ్రైవర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.  శనివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు స్థానిక గోదావరి గట్టు గౌరీ సమేత శివాలయం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడు రవి నాథ్ ( 64) నీ ఢీ, కొట్టి వేగంగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు క్రింద పడిపోగా,  కాన్వాయ్ వాహనం కుడివైపు అద్దం పగిలింది . ఈ ఘటనలో ప్రాణాపాయం నుండి వృద్ధుడు తృటిలో తప్పించుకోవడం గమనార్హం . నిజానికి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు పోయిన ప్రాణం తిరిగి తీసుకుని రాగలరా అని స్థానికులు ప్రశ్నించారు కనీసం మానవత్వం లేకుండా ఎంపీ కాన్వాయ్ వ్యవహరించడం సరికాదని పలువురు వాపోయారు. సామాన్యులు ఎవరైనా ఇదే విధంగా రేష్ డ్రైవింగ్ చేస్తే వారిపై ప్రతాపం చూపించే పోలీసులు ఎంపీ కాన్వాయ్ డ్రైవర్లపై ఉదాసీనంగా ఉండడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  కాన్వాయ్ ఆపి కనీసం గాయపడిన బాధితున్ని పరామర్శించిన మానవత్వం  ప్రదర్శించడంపై  స్థానికులు విమర్శిస్తున్నారు.