ఆదర్శంగా నిలిచిన పవర్ లిఫ్టింగ్ జమ్స్....!!!
జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ లో ఘనత సాధించిన ఇబ్రహీంపట్నం జాహ్నవి జిమ్ పవర్ లిఫ్టర్లు....!!!
విజేతలను అభినందించిన జాహ్నవి జిమ్ చైర్మన్ ఎం.దేవదాస్ రెడ్డి...!!!
సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో పథకాలు కైవసం చేసుకున్న క్రీడా కారులు...!!
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ లో ఇబ్రహీంపట్నం జాహ్నవి జిమ్ క్రీడాకారులు అసాధారణ ప్రతిభ కనబరిచి పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ నెల 23 న చిల్లకల్లు కేంద్రంగా జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ లో జాహ్నవి జిమ్ క్రీడా కారులు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో విజయం సాధించారు. సబ్ జూనియర్ 93 కేజీల విభాగానికి గాను టీ. భరత్, 59 కేజీలకు గాను ఎస్ కే సాదిక్ భాష ప్రథమ స్థానం సాధించారు. జూనియర్ విభాగం లో 93 కేజీలు గాను టీ. భరత్ మొదటి స్థానం, 74 కేజీల కు గానూ ఏ.గోపి కృష్ణ తృతీయ స్థానం సాధించారు. ఇక సీనియర్ విభాగం లో ఏ.గోపీకృష్ణ మూడవ స్థానం దక్కించుకొని ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా జాహ్నవి జిమ్ చైర్మన్ ఎం.దేవదాస్ రెడ్డి, కోచ్ విక్కి గెలుపొందిన విజేతలకు ఘనంగా సన్మానించి అభినందించారు.
సత్య....రిపోర్టర్
మైలవరం