సంక్షేమ పథకాల ప్రదాత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి

TV77తెలుగు రాజమండ్రి రరూల్ స్థానిక మొరంపూడి జంక్షన్ నందు చీర రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి,12వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిదిగా హాజరైన రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కో-ఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్.మొరంపూడి జంక్షన్ నందు చీర రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకకు చందన నాగేశ్వర్ హాజరయ్యి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘానా ఘన నివాళి అర్పించి చందన నాగేశ్వర్ గారు మహిళలకు చీరలు పంచిపెట్టారు.అనంతరం చందన నాగేశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, పేద ప్రజల గురుంచి ఆలోచించి సంక్షేమం పథకాలు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావల వడ్డీ ఋణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వై.ఎస్.ఆర్ చిరస్థాయిగా నిలిచారు అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హుకుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, డైరెక్టర్ చీర రాజు ,వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యిలి గోపాలం, షీప్ & గోట్ డెవలప్మెంట్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి, మేడి త్రిమూర్తులు, పిల్ల లక్ష్మణ్, పసలపూడి శ్రీనివాస్, గణేష్, పెయ్యాల రాజేష్, మత్సెటి శివ తదితరులు పాల్గొన్నారు.