నాటు తుపాకులు తయారీ వ్యక్తి అరెస్ట్
iraila 02, 2021
TV77తెలుగు ఏలూరు
ఏలూరులో ఓ వ్యక్తి ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వెంకటేష్ సింగ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఈ తుపాకులు తయారు చేసినట్లు వాళ్లు గుర్తించారు. నిందితుడి వద్ద 12 రెడీ టు యూజ్ తుపాకులు, 6 ఇతర తుపాకులు, గన్ పౌడర్, 33 కేజీల చిన్న ఇనుప గుండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు (తాలిబన్లు) ఓపియం(నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీతో మొదలై, నేడు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారు’ అంటూ ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ హయాం గురించి కూడా ప్రస్తావించిన లోకేష్. ‘చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే. జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్ర’ అంటూ ఆరోపించారు...