వినుకొండ లో మద్యం స్వాధీనం ఒక వ్యక్తి అరెస్ట్

TV77తెలుగు వినుకొండ: వినుకొండ ఎస్ ఈ బి స్టేషన్ పరిధి లోని వినుకొండ టౌన్ లో ఎం ఎస్ పి కెనాల్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించచుండగా స్కూటీ మీద మద్యం సీసాలు తీసుకువెళ్తు ఇరువురు వ్యక్తులు పారిపోవుచుండగ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగినది.మరొక వ్యక్తి పారిపోయాడు వారి వద్ద నుండి 61 మద్యం సీసాలు, 180 ఎమ్మెల్ పరిమాణం కలిగిన స్వాధీనం చేసుకొన్నారు. వారి వద్ద నుండి స్కూటీ ని స్వాధీనం చేసుకోవడం జరిగినది. వారు పిచికలపలెం గ్రామానికి చెందిన .దుగ్గెంపుడి ప్రసాద్ నెల్లూరి రాఘవయ్య ఇతను మున్సిపాలిటీ ఎదురు గా వుండే షాప్ ప్రభుత్వ మద్యం దుకాణం లో సెల్స్ మాన్ గా పనిచేస్తాడు.వినుకొండ కోర్టు ఎదుట హాజరు పరచగా వారిని 15 రోజులు రిమాండ్ విధించారు. పారిపోయిన వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ దాడిలో సెబ్ ఇన్స్పెక్టర్,సిబ్బంది పాల్గొన్నారు.నాటుసారా,అక్రమ మద్యం ఇసుక, గుట్కా కి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వినుకొండ ఎస్ ఈబి ఇన్స్పెక్టర్ కు తెలియపర్చగలరు.